సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్‌ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నేడు, సోమవారం పర్యావరణ, అటవీ శాఖ జీవోఆర్టీ నంబర్‌ 93 జారీ చేసింది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్‌ ప్రధాన లక్ష్యం. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబుకు కేబినెట్‌ ర్యాంక్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ గ్రీన్‌ సొసైటీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గవర్నింగ్‌ బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీల (DGDA) పాలక మండళ్లను ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *