సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాలు తక్కువ పడటంతో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ రైతాంగం నష్టపోకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు, జిల్లా రైతు సంఘం, ఆధ్వర్యంలో నేడు, సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగాసిపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. కౌలు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కౌలు రైతులకు పంట రుణాలు, గుర్తింపు కార్డులు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవీ ఆనంద్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎం. సీతారాం ప్రసాద్, సనపల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *