సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో 2,174.675 చదరపు కిలోమీటర్ల పరిధిలో భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (BHIMA UDA) ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం ఈ అథారిటీ పరిధిలో 6 మున్సిపాలిటీలు,19 మండలాలు, 282 గ్రామాలును చేరుస్తు అధికారిక ఉత్తర్వులు జారీ చెయ్యడం పట్ల డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేసారు. ఇకపై భవన నిర్మాణాలు తదితర పరిమిషన్స్ కు ఎక్కడో ఏలూరు వెళ్లి అక్కడ డబ్బు చెల్లించనక్కరలేదని, జిల్లా కేంద్రం మన భీమవరంలోనే వాటిని సాధించుకొని ప్రజలు డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చునని తెలిపారు.
