సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్లో స్టేట్ హైవే అధికారులతో ఉండి నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితిపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో నూతన రహదారుల అభివృద్ధి,, నిర్మాణాలు , మరమ్మతులు, పెండింగ్లో ఉన్న పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. రహదారుల నాణ్యత, పనుల వేగం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను రఘురామా ఆదేశించారు.
