సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని విధంగా అకస్మాత్తుగా దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల మార్కెట్లలో కిలో చక్కెర ధర రూ.65కు చేరడంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. చెరకు దిగుబడి బాగా తగ్గడం, ఉన్న చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించడం, వ్యాపారుల నిల్వలు, వరుస పండుగలతో పెరిగిన డిమాండ్‌ వంటి కారణాలతో చక్కెర ధరలు పెరుగుతున్నాయి.ఓవైపు పండుగలు వరుసకట్టాయి ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లిందిపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం స్టాక్ పరిమితులు విధించింది.చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు కి చక్కెర ధర చేదెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *