సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల నిరీక్షణకు తెరపడింది. దిండి–చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలునేటి గురువారం తెల్లవారు జాము నుండి పునఃప్రారంభమయ్యాయి. వంతెన మరమ్మతుల కారణంగా ( ఒక పిల్లర్ కాస్త కుంగడంతో ) గత ఏడాది పైగా భారీ వాహనాల రాకపోకలను ఆ వంతెన ఫై నిలిపివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం నుండి 2 గంటలలో ఆర్టీసీ బస్సులో అమలాపురం వెళ్లే ప్రయాణికులు రావులపాలెం మీదుగా 3గంటల పైగా ప్రయాణం చెయ్యవలసి వచ్చేది. ప్రత్యామ్నాయ మార్గాల్లో రాజోలు వైపు ప్రయాణించాల్సి రావడంతో సమయం, వ్యయభారం పెరిగింది.పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు వంతెనపై భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వడంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *