సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు .. గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం నేపథ్యంలో తెలుగుభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. భారత దేశంలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే బాషా తెలుగు బాషా అభివృద్ధి కి మరింత కృషి చేస్తామని ప్రతినబూనారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి .. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు’తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
