సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాల లో ఎడతెరపి లేకుండా నిన్న రాత్రి నుండి నేటి శనివారం వరకు వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. భీమవరంలో కూడా ఇదే పరిస్థితి. ఇన్నాళ్లకు ఇటీవల వర్షాకాలం తలపించేలా సుదీర్ఘంగా వర్షపు జల్లులు పడుతూనే ఉండటం గమనార్హం. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది.
