సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జనసేన నాయకులు, కార్యకర్తలు, తో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ 2024 ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 100 స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాలన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం పాటిస్తూనే జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటాలన్నారు. స్థానిక ఎన్నికల్లో వ్యూహాలు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించే నియమాల ప్రకారం ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే అంజిబాబు సూచించారు. భీమవరం మునిసిపాలిటీ ఎన్నికలలో 1వ వార్డు నుంచి 39వ వార్డులలో మన బలాబలాలు గుర్తించాలని, 100 శాతం స్ట్రైకింగ్ రేట్‌ తో విజయమే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి కృష్ణ, ఏపిఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులకు ఢోకానే లేదని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *