సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజన తరువాత అనేక వివాదాలు తరువాత ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో తెలుగు సినిమాలకు ఇచ్చే నంది అవార్డుల సందడి మొదలు కానుంది. సినీ, టీవీ రంగాలకు ఏపీ సర్కార్ తరపున మంత్రి దుర్గేష్ నేడు, మంగళవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (G.O.Rt.No. 1843) జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతోపాటు, 2025 అవార్డులను ఒకేసారి నిర్వహించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2012-2016 కాలానికి చెందిన నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 2026లో విజయవాడలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అవార్డుల విజేతల జాబితాను నవంబర్ 2026లో అధికారికంగా ప్రకటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *