సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్య పింఛనుదారులకు వారి వయస్సు ను దృష్టిలో పెట్టుకొని అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్ నంబర్- 126ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 70 ఏళ్లు పూర్తయిన పింఛనుదారులు/ఫ్యామిలీ పింఛనుదారులకు అదనపు పింఛన్‌ను 7శాతం నుంచి 10శాతానికి రాష్ట్ర సర్కార్ పెంచింది.75 ఏళ్లు దాటిన పింఛనుదారుల అందరికి కు అదనపు పింఛన్‌ను 12శాతం నుంచి 15శాతానికి కూటమి సర్కార్ పెంచింది.ఈ పెంచిన అదనపు పింఛన్ డిసెంబర్ 2026 నెల పింఛనుకు వర్తిస్తుందని స్పష్టం చేసింది పెరిగిన ఈ మొత్తాన్ని జనవరి 1, 2027న చెల్లించనుంది
