సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమ ముడి చమురు ఎగుమతులను అడ్డుకోవడం తో పాటు సౌదీలోని పలు నగరాలపై ఇరాన్ కు మద్దతుగా ఒమెన్ లోని హౌతీల తీవ్ర దాడుల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా అండగా నిలవకపోడంతో . అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అమెరికా మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి కరెన్ గిబ్సన్ ప్రకటించారు. తాము తీవ్ర స్థాయిలో నష్ట పోతున్నామని ఈ నేపథ్యంలో హౌతీలపై సైనిక చర్యకు అమెరికా సహకరించాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌ను కోరారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ప్రత్యక్ష వైమానిక దాడులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై ఎంబీసీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు గిబ్సన్ వ్యాఖ్యానించారు. మరో ప్రక్క ఇరాన్ కు హౌతీ లకు బయపడి సౌదీ తో రక్షణ ఒప్పందం చేసుకొని వేల కోట్ల రుణాలు పొందిన పాకిస్తాన్ ముఖం చాటెయ్యడం తో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కు గొప్ప గుణపాఠం అయ్యింది. ఇటు అమెరికా, టర్కీ, కూడా కష్టాలలో ఉన్న సౌదీ ని వారి కర్మకు వదిలేశాయి అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోవైపు, హౌతీలతో చర్చలు జరిపినట్టు ట్రంప్ వెల్లడించడం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా దాడులు చేయబోమని హౌతీలు తమకు హామీ ఇచ్చినట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించడం సౌదీ కి మింగుడు పడని మరో విషయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *