సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆరాధించి వీక్షించే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ 68 అడుగుల మహాగణపతి శోభాయాత్ర నేటి శుక్రవారం ఉదయం నుండి పోలీస్ భద్రతా వలయం మధ్య ప్రారంభమైంది. లక్షలాది భక్తులకు తన అస్సిసులను అందజేస్తూ శ్రీమహాగణపతి నగర యాత్ర చక్కగా జరుగుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఎంతో ప్రత్యేకత విశిష్టత ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూను నేటి శుక్రవారం ఉదయం జరిగిన వేలం పాటలో రూ.39 లక్షలకు సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర రూ.35 లక్షలు పలుకగా.. ఈ సారి రూ.4 లక్షలు అదనంగా లడ్డూ ధర పలికింది. అర్బన్ గ్రూప్‌కు చెందిన ప్రణీత్ రెడ్డి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *