సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఎప్పుడో యమ దొంగ రిలీజ్ అయ్యి దశాబ్దం న్నర తరువాత ది ప్యారడైజ్ సినిమా మరోసారి మోహన్ బాబు గతాన్ని గుర్తుచేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన గత గురువారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం సీనియర్ హీరో ‘మోహన్ బాబు’ విలనిజం.. వయస్సు 75 పరుగెడుతున్న పర్సనాలిటీ తగ్గలేదు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ లో గాంభీర్యం తగ్గలేదు. ఈ సినిమా చూశాక ట్రోల్స్ లో చుసిన మోహన్ బాబు అసలు పొటెన్షియల్ ఏంటో మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత యువతకు మైండ్ బ్లాకింగ్ అయ్యేలా స్పష్టమైంది. ఆయన సీన్లలోని డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి కుర్రకారు థియేటర్లలో ఈలలు, కేరింతలతో రచ్చ చేస్తున్నారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మోహన్ బాబు హీరో నానినే డామినేట్ చేశాడు. తాను తగ్గి మోహన్ బాబు సత్తా. గౌరవం చూపించిన నాని కూడా అభినందనీయుడు. వివాదాలు జోలికి పోకపోతే .. ఇప్పటికే కోటి 18 లక్షలు కలెక్షన్స్ వాసులు చేసినట్లు నిర్మాతలు ప్రకటిస్తున్నారు. నేడు, రేపు ఆదివారం కలపి అవలీలగా కోటిన్నర గ్రాస్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రన్‌కు బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ నేటి, శనివారం రాత్రి తాను ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజజీవిత వ్యక్తిత్వాన్ని పోలి ఉన్న ఒక సీన్ సినిమాలో హైలైట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి.. కేసీఆర్ గా కనిపించాడు. థియేటర్లలో ఈ సన్నివేశానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *