సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడలో పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వేలాది మంది పెద్ద ఎత్తున నిరసన చేప్పట్టిన నేపథ్యంలో .. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు, మంగళవారం, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వం ఎటువంటి సర్వీస్ రూల్స్ లేకుండా 1.24 లక్షల మందిని నియమించి వారి బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సచివాలయ వ్యవస్థను, ఉద్యోగుల సర్వీసులను స్ట్రీమ్‌లైన్ చేస్తున్నామని వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 15,000కు పైగా ప్రమోషన్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 6 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌కు అనుమతి ఇచ్చామని.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.150 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రకటించారు.
