సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ‘సంకల్ప అభియాన్’లో భాగంగా వీరవాసరం మండలం పెర్మిపాలెం అంగన్‌వాడీ (ప్రీ ప్రైమరీ) స్కూల్‌ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులుతో కలసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు విశేష సేవలందిస్తున్న టీచర్లు, ఆయాల సేవలను ప్రశంసించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు.. మొత్తంగా 25 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నిరంతరం ప్రజా సేవకే అంకితమయ్యారని కొనియాడారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే దేశవ్యాప్తంగా నెల రోజులపాటు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *