సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ లో జరుగుతున్నా ప్రతిష్టాకరమైన ఆసియా క్రీడల్లో నేడు,బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. దీనితో భారత్ ఖాతాలో 10 స్వర్ణాలు చేరాయి. 21 వెండి 27 కాంస్య పతకాలతో భారత్ క్రీడాకారులు తమ ప్రతిభ ను చూపుతున్నారు. నేడు ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం. ఇప్పటికే మహిళల టీమ్ ఈవెంట్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక త్రయం హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో చైనాను ఓడించి స్వర్ణ పతకం సాధించింది.. ఆ తర్వాత మిక్స్డ్ టీమ్ విభాగంలో చికితా, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో పసిడి దక్కించుకున్నారు.తాజాగా కాంపౌండ్ పురుషల ఆర్చరీ ఈవెంట్లోనూ భారత్కు గోల్డ్ మెడల్ వచ్చింది. సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం, కుషాల్ త్రయం చైనాపై అద్భుత ప్రదర్శనతో నెగ్గారు. దీంతో ఒకే రోజు ఆర్చరీలో భారత్ మూడు స్వర్ణాలు కైవసం చేసుకుంది
