సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి సర్కార్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు నేడు, గురువారం కొట్టివేసింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ఇప్పటివరకు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిజానికి ఎక్కడైనా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇప్పుడు 59శాతం సీట్లు ఎలా రిజర్వేషన్స్ కు కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ జీవోలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. నిజానికి చట్టం ప్రకారం బీసీల జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
