సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాలలో కొబ్బరి రైతులకు ధర పెరగటంతో మంచి రోజులు వచ్చాయి, ముఖ్యముగా కొబ్బరి ఎగుమతులు ఎక్కువ గా కోనసీమ కొబ్బరికి ధరలు పెరిగాయి. త్వరలో దసరా, దీపావళి పండుగలు కార్తీక మాసం రానున్న విషయం తెలిసిందే. రిటైల్ మార్కెట్ లో కొబ్బరి కాయలు ధర ఒకొక్కటి 35 రూపాయలు నుండి 50 రూపాయలు అమ్ముడుపోతున్న సరే గోదావరి జిల్లాల్లో కొబ్బరి కి పెద్దగా ధర పలకకపోడం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తక్కువ ఉండటం తో రైతులు నిరాశగా ఉన్నారు. అయితే ఇటీవల కోనసీమ, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల నుండి హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ ,చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర రాష్ట్రాలకు రోజుకు 70 నుండి 100 లారీలకు పైగా ఎగుమతులు పెరిగినట్లు సమాచారం. ధరలు కూడా కయ సైజు బట్టి 20 రూపాయల నుంచి 24 వరకు కొబ్బరికాయకు ధర పెరిగింది. 1000 కొబ్బరికాయలు ధర 20వేల నుండి 24 వేల వరకు పలుకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *