సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:జపాన్ లో జరుగుతున్నా ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు, క్రీడాకారిణి లు సంచలన విజయాలు నమోదు చేస్తూ 11 బంగారు పతకాలు సాధించారు., ముఖ్యంగా ఆర్చరీ విభాగంలో భారత్ గురి తప్పలేదు. ఏకంగా 5 బంగారు పతకాలు ఇప్పటి వరకు సాధించి ఆసియాలో నెంబర్ వన్ గా తొలిసారి సత్తా చాటింది భారత్..నేడు, శుక్రవారం మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఉన్న సౌత్ కొరియా ఆధిపత్యానికి చెక్ పెడుతూ కుమ్‌కుమ్, అంకిత, కీర్తిల త్రయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 5-3 తేడాతో కొరియాను ఓడించింది.తొలి రెండు సెట్లు డ్రా కావడంతో పోటీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తర్వాత రెండు సెట్లలో భారత ఆర్చర్లు ఏమాత్రం తడబడకుండా లీడ్ సాధించారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దక్షిణ కొరియా స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాంటి జట్టును భారత్ ఖంగుతినిపించి కింగ్ అయ్యింది,. ఈ విజయంతో భారత్ ఖాతాలో స్వర్ణ పతకాల సంఖ్య 11కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *