సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. పల్లె పండుగ 3.0 లో భాగంగాఆయన టీడీపీ నేతలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి తో పలువురు కూటమి నేతలు తో కల్సి పల్లె పండుగ 2.0 లో మంజూరైన నిధులతో.. నేడు సోమవారం భీమవరం మండలం దొంగపిండి, కొత్తపూసల మర్రు, గుట్లపాటు, గొల్లవాని తిప్ప, అనాకోడేరు, ఎల్ ఎన్వీ పురం గ్రామంలో పలు సీసీ రోడ్డుకు శంకుస్థాపన, పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. దొంగపిండి గ్రామంలో జీఎస్ బి రోడ్డుకు శంకుస్థాపన, సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, కొత్తపూసల మర్రు గ్రామంలో జీఎస్ బి రోడ్డు శంకుస్థాపన, నాబార్డ్ లో మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లు ప్రారంభోత్సవం, గూట్లపాడు గ్రామంలో జీఎస్ బి రోడ్డు, సీసీ రోడ్లు శంకుస్థాపన,గొల్లవాని తిప్ప గ్రామంలో జీఎస్ బి రోడ్లు, సీసీ రోడ్డు శంకుస్థాపన, అనాకోడేరు గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన, ఎల్ ఎన్ వి పురం గ్రామంలో సీసీ రోడ్లు, జీఎస్ బి రోడ్డు శంకుస్థాపన, సీసీ రోడ్లును ప్రారంభించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *