సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి నేడు, మంగళవారం ఉదయం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. పవన్‌కు చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, తో ఉపముఖ్యమంత్రి భేటీ జరిగింది. ఈ క్రమంలో తొలిదశలో జరిగే నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై ఇరువురు నేతల మధ్య ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది ఏ ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకుండా చేయాలని నేతలు నిర్ణయించారుస్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పక్షాల మధ్య సమన్వయం, కలిసి పోటీ చేయడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గెలుపే ప్రధాన లక్ష్యంగా పలు స్థానాలలో కూటమి నేతలలో పర్సంటేజ్లతో సంబంధం లేకుండా ఎవరికి బలమున్న ప్రాంతాలలో ఆపార్టీ నేతల అభ్యర్థులు పోటీ చేయాలని, వారికీ బేషరతుగా కూటమి మద్దతు ఇవ్వాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం.ఏ ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకుండా చేయాలని నేతలు నిర్ణయించారు. అలాగే, రాబోయే శుక్రవారం బిసి రిజర్వేషన్స్ ఫై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
