సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కాబినెట్ మంత్రుల సమావేశంలో 12 కీలక అంశాలపై నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. రూ.20.62 కోట్లతో APHIMS ప్రాజెక్టుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. 72 నెలల పాటు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రతి ఏడాది వారి సేవకు రూ.5 వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.వెల్లడించారు. 2026-27 తల్లికి వందనం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని చెప్పారు. అదనంగా 58,060 మందితో కలిపి ఈసారి 68,57,880 మందికి ఈ పథంకం వర్తించనున్నట్లు చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో డైట్‌ ఛార్జీల పెంపుపై కాబినెట్ ఆమోదించింది.విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం IIT-JEE, NEETకు ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందన్నారు సిటీ పెరుగుతున్న కొద్దీ గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వచ్చిన వారు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించి ఇళ్లు కట్టుకోవడం సహజమని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి వీరికి న్యాయం చేయడానికి పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం చేపట్టారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *