సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం లో వ్యాపార వర్గాలకు ప్రతిష్టాకర సంస్థగా భావించే ‘ది భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్‘ భవనంలో ఇటీవల ఇప్పటివరకు ఛాంబర్ లో నమోదు కానీ వ్యాపార సంస్థలు కూడా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొంటున్నాయి. దీనితో ఇకపై భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ ను మరింత విస్తరిస్తూ ఇకపై పట్టణంలోని అన్ని వ్యాపార శ్రామిక సంఘాల సబ్యులకు కూడా భాగస్వామ్యం కల్పించడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు. పలు వ్యాపార సంస్థల సభ్యత్వాలు కూడా ఛాంబర్ పరిధిలోకి తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం అయ్యింది.. ఈనేపథ్యంలో ఇటీవల 60 మంది ఎలెట్రికల్ డీలర్స్ సంఘ సభ్యులు, 55 ఐస్ ప్లాంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు చాంబర్ ఆఫ్ కామర్సులో వారి సంఘమునకు నూతన సభ్యత్వం ఇప్పించవలసిందిగా కోరుతూ ఛాంబర్ గవర్నింగ్ బాడీ సభ్యుల సమక్షంలో చాంబరు అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త కి అప్లికేషన్ అందించడం జరిగింది. వారి సభ్యత్వాలు ఆమోదించడానికి ఛాంబర్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
