సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో వివాదాలు ఎదుర్కొని తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఆకివీడు లోని శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తాజగా పర్యవేక్షించారు. శరవేగంగా పనులు క్వాలిటీ తో పూర్తీ అవుతున్న నేపథ్యంలో సంతృప్తి వ్యక్తం చేసారు. శ్రీ రామాలయానికి నూతనంగా నిర్మించిన రహదారి మీదుగా ధ్వజస్తంభాన్ని ఆలయానికి తీసుకువచ్చామని, త్వరలోనే ఈ రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నామని రఘురామ తెలిపారు.అలాగే రహదారి ప్రారంభంలో ఆహ్లాదకరమైన పార్కును నిర్మించి, శ్రీ రామ భక్తుడైన శ్రీ త్యాగరాజ స్వామి వారి కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించనున్నామని, ఈ పార్కుకు “త్యాగయ్య పార్క్”గా నామకరణం చేయనున్నామని తెలిపారు.
