సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ‘లాభం’ ఫై తప్ప నైతిక విలువలు ఫై నమ్మకం లేదని మరోసారి రుజువు అయ్యింది. తాజగా ప్రపంచ దేశాలను ముఖ్యంగా ఇటు భారత్ అటు ఉక్రెయిన్ ను షాక్ కు గురిచేస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారీ డీజిల్ కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై 100% వరకు టారిఫ్‌లు విధిస్తామంటూ ఇన్నాళ్లూ హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు తానే స్వయంగా రష్యాతో చేతులు కలపడం భారత ప్రధాని నరేంద్ర మోదీ యంత్రాంగాన్ని తీవ్ర షాక్ గురిచేసింది. ఇరాన్ తో యుద్ధం కారణంగా పీకల లోతు కూరుకుపోయిన ట్రంప్ కు అమెరికాలో డీజిల్, ఇతర ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికాలో త్వరలో జరగనున్న కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయంతో.. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఆంక్షలను ఎత్తివేసారు, వెంటనే ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ జరిపిన ఫోన్ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది: దీనితో తక్షణ సరఫరా: రష్యా వెంటనే 3 లక్షల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను అమెరికా మరియు ప్రపంచ మార్కెట్లకు విడుదల చేస్తుంది. వచ్చే నవంబర్‌లో అదనంగా 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేయనుంది. గతంలో ఇది రష్యా నుండి చమురు కొంటే ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు ఇచ్చినట్లే అని ప్రపంచ దేశాలను భయపెట్టిన ట్రంప్,మరి ఇప్పుడు స్వయంగా రష్యా తోనే భారీ ఒప్పందం చేసుకోవడంపై ఉలిక్కి పడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *