సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పలు ప్రముఖ దేవాలయాలలో దసరా ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నేటి ఆదివారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం లో శ్రీ సోమేశ్వర, మహాలక్ష్మి అవతారంలో ఉన్న శ్రీ పార్వతిదేవి ( ఫై చిత్రంలో) అమ్మవారిని, అన్నపూర్ణాదేవి వారిని దర్శించుకొన్నారు. ఆలయ చైర్మెన్. బంగార్రాజు , ధర్మకర్తల మండలి సభ్యులు , ఇఓ రామకృష్ణంరాజు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వగతం పలికి శేష వస్త్రం తో అర్చకులు శ్రీ స్వామి దేవేరుల అస్సిసులు అందజేశారు. తదుపరి నాచు వారి సెంటర్ లోని శ్రీ కనక దుర్గా అమ్మ వారి టెంపుల్, భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మ వారి ఆలయం, మరియు రాయలం లోని శ్రీ సిద్ది వినాయక టెంపుల్ లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
