సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ కాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్ర తీరంలో నేడు, గురువారం జరిగిన ఘోర విషాదంలో ముగ్గురు యువతులు, వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ శిక్షణ సంస్థకు చెందిన సుమారు 25 మంది విద్యార్థులు దసరా సెలవులను పురస్కరించుకుని శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పీజీపేట సముద్ర తీరానికి విహారయాత్ర నిమిత్తం వెళ్లారు.ఈ క్రమంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి(19), రామభద్రాపురానికి చెందిన గొల్లపల్లి పావని(19), పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన మర్రి మహి(18) సరిగ్గా ఈ ప్రాంతానికే వెళ్లి సెల్ఫీలు దిగుతుండగా ఊబిలో కూరుకుపోయారు. అదే సమయానికి సముద్రపు అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయారు. యువతులు మునిగిపోతుండటాన్ని గమనించిన సమీపంలోని బిడ్డిక విక్రమ్ (25) అనే యువకుడు వారిని కాపాడేందుకు ఎలాంటి వెనుకాడకుండా వెంటనే సముద్రంలోకి దూకాడు. ఎంతో సాహసంతో ఇద్దరు యువతులను (మహి, పావని) ఒడ్డుకు తీసుకురాగలిగాడు.అయితే వారు అప్పటికి మరణించారు. మిగతా ఇద్దరినీ రక్షిద్దామని వెళ్లి సముద్ర ఉదృతి కి అతను కొట్టుకొనిపోయాడు.
