సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, మొదలుకొని చించినాడ కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, 27 నుంచి తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తాజగా.. థాయ్‌లాండ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వరుసగా 2 అల్ప పీడనములు వచ్చే సూచనలు స్వష్టంగా కనిపిస్తున్నాయి
