సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్త ఆంధ్ర వైపుగా ‘అర్నబ్’ తుఫాన్ దూసుకొనివస్తుంది. . రేపు మంగళవారం రాత్రికి వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారి ఎల్లుండి బుధవారం రోజు బాపట్ల – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం కాకినాడ, కోనసీమ ఫై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.. ఈ క్రమంలో నేడు, సోమవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ ఎం.హరిందర ప్రసాద్ మాట్లాడుతూ.. అర్నబ్ తుఫాన్ కాకినాడను తాకే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ షెల్టర్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని.. రేపు మంగళవారం ఉదయం నుండి తీరప్రాంతాలలోని ప్రజలను తరలించనున్నట్లు చెప్పారు. మత్యాకారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. కంట్రోల్ రూం నంబర్లు 08842356801, 9849903879కు సంప్రదించవచ్చని తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో కాకినాడ, కోనసీమ జిల్లాలలో రేపు, ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్స్ ఎం.హరిందర ప్రసాద్, కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్(కోనసీమ) లు పేర్కొన్నారు.
