సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి అపూర్వ చిత్రాలతో వార్షిక కేలండర్ కు దశాబ్దాలుగా ఎంతటి డిమాండ్ ఉంటుందో అందరికి తెలిసిందే.. తాజగా తిరుమల శ్రీవారి భక్తుల కోసం 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో అందుబాాటులోకి తీసుకొచ్చింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకోవచ్చు.ముఖ్యంగా 6 పేజిలతో 12 బొమ్మలతో గోడ కాలెండర్ రుసుము 450 రూపాయలు చెల్లించి కొనుగోలు చెయ్యవచ్చును.డైరెక్టుగా కొనుగోలు చెయ్యడానికి 12 కేంద్రాలలో దొరుకుతాయి, తిరుపతి, తిరుమల, తిరుచానూరు, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు..శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 పేజిలతో 12 బొమ్మలతో గోడ కాలెండర్ రుసుము 450 రూపాయలు చెల్లించి కొనుగోలు చెయ్యవచ్చును.
