సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనపై కేంద్ర పెద్దలతో చర్చించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలు నష్టపోతాయని, కానీ కేంద్రం ముందు చూపుతో చేస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందని ప్రశంసించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు దక్షిణాదికి చారిత్రక అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 50 శాతానికి పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మన AP రాష్ట్రంలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి చేరుతాయని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 నుంచి 26కి, తమిళనాడులో 39 నుంచి 59కి పెరుగుతాయన్నారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయని వివరించారు. ఈ మేరకు అందరికీ విన్-విన్ పరిస్థితి ఉందని అన్నారు. ప్రస్తుతం దక్షిణాదిన 129 లోక్‌సభ సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తర్వాత 195కి చేరుతాయని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *