సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రముఖ సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సినీ హీరో మాజీ కేంద్ర మంత్రి వర్యులు స్వర్గీయ కృష్ణంరాజు కి సీనిహిరోలా అభిమానులు జ్యూవ్వలపాలెం రోడ్ లో చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అందరిహిరోల అభిమానుల నేతలు మాట్లాడుతు.. మన ప్రాంతం నుండి వెళ్లిన కృష్ణంరాజు గారు తెలుగు సినిమారంగంలో ఎంతో రాణించారని, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు , మధుర స్వప్నం, నాయుడుగారి కుటుంబం ఇలా అన్ని తరహా పాత్రలలో క్లాస్, మాస్ , చారిత్రకం, పారాణికం ఎలాంటి చిత్రాలయిన అద్భుతంగా నటించేవరని ఎంపీ గా,కేంద్ర మంత్రిగా కూడా మన ప్రాంతం లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొని యాడరు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఫ్యాన్స్ బి హె చ్ సుబ్బరాజు, హుస్సేన్, బోనం ప్రసాద్, చిరంజీవి ఫ్యాన్స్ చల్లా రాము, యాతం స్వామి, కొప్పర్తి కోటి, బాలకృష్ణ ఫ్యాన్స్ చిరుకూరి రామకృష్ణ చౌదరి, నాగార్జున ఫ్యాన్స్ యల్ డి ప్రసాద్,మోహన్ బాబు ఫ్యాన్స్ వసురాజు, వెంకటేష్ ఫ్యాన్స్ ఐ జె వర్మ, శోభన్ బాబు ఫ్యాన్స్ భట్టిప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
