సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం లో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ( నేటి సాయంత్రంలోగా బహుశా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే తరహా సెలవులు ప్రకటించవచ్చు..) ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.
