సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న 26 మందులను కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ నిషేదించింది. వాటి వాడకం వల్ల సైడ్ ఎఫిక్ట్స్ వస్తున్నాయని గమనించి ఈ చర్య తీసుకోవడం జరిగింది. నిషేదిత మందులలో కీలకమైన Ranitidine అనే మెడిసిన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్సర్ వంటి గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బంది పడేవారితో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు ఈ మెడిసిన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. Ranitidine మెడిసిన్ కలిగిన బ్రాండ్స్ అయిన Rantac, Zinetac, Aciloc మందుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా తేలడంతో అత్యవసర మందుల జాబితాలో నుంచి వీటిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తొలగించింది. 384 మెడిసిన్స్‌తో కూడిన National List of Essential Medicines (NLEM) కొత్త జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ జాబితా నుంచి 26 మెడిసిన్స్‌ను తొలగించింది. అంటే.. దీనర్థం ఇకపై ఈ 26 రకాల మందులు దేశంలో అందుబాటులో ఉండవు. ఇదిలా ఉండగా.. Zantac ప్రపంచంలోనే విరివిగా వినియోగంలో ఉండే మందు. ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించడంతో భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే కొన్ని మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
