సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో కీలక అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నేడు, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు గ్రామీణ పంచాయతీ అధికారులు, డివిజనల్ డెవలప్‌మెంట్‌ అధికారులు, జిల్లా ప్రజాపరిషిత్ డిప్యూటీ సీఈవోలుగా బాధ్యతలు అప్పగించింది. ఇందులో కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా పి.విజయభాస్కర్ ను కొత్తగా నియమించారు. అమలాపురం డివిజనల్ డెవలప్‌మెంట్‌ అధికారిగా పి.వసంత మాధవి బాధ్యతలు చేపట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.మంజుల వాణి, అనకాపల్లి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా కె.రమామణి నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *