సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లాల్లో నేటి ఆదివారం ఉదయం కోరుకొండ వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గోకవరం నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారు ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉదయ్ కిరణ్ మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన విద్యార్థులు హేమంత్, దూడే హర్షవర్ధన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన కారు డ్రైవర్ పలివెల ప్రణీత్, వేమూరి వంశీ, కరటూరి హేమంత్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
