సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan ) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో నేడు, గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..’ రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం ఉంది. ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ప్రారంభించాం.మత్యకారులకు అండగా నేను ఉంటాను. ఇక్కడ చేపల వేటపై 7 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళన ఉందన్నారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈనెల 14న సమావేశం నిర్వహిస్తామని, అలానే ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
