సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ వచ్చి 7 రోజులు కాకుండానే చైనా లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్నారు. బీజింగ్ శిఖరాగ్ర భేటీలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాము అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నామని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఒక సంయుక్త ప్రకటనలో,. “అంతర్జాతీయ సమాజం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం, కొందరు ఏకపక్ష నియంతృత్వ విధానాలతో ప్రపంచంలో ‘అడవి చట్టం’ తిరిగి వచ్చే ప్రమాదం ఉంది” అని ఒక ప్రత్యేక సంయుక్త ప్రకటన హెచ్చరించింది. “వలసవాద కాలపు స్ఫూర్తితో, ప్రపంచ వ్యవహారాలను ఏకపక్షంగా నిర్వహించడానికి, తమ ప్రయోజనాలను ప్రపంచం మొత్తం మీద రుద్దడానికి, ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధిని పరిమితం చేయడానికి కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి,” అని ఆ ప్రకటన జోడించింది. అమెరికా- రష్యా మధ్య చివరి ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు ముగియడాన్ని కూడా ఇద్దరూ నేతలు విమర్శించారు.
