సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో విక్టరీ వెంకటేష్ తో కలసి ‘మన శంకర వర్రపసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు. సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుగుతున్నా ‘విశ్వంభర’ పూర్తి చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి పెద్ద హిట్‌ ఇచ్చిన బాబీ కొల్లితో ‘మెగా158’ (Mega 158) చిత్రం షూటింగ్ నేడు, గురువారం పార్రంభమయ్యింది. . ఈ చిత్రంతో కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. హైదరాబాద్‌, అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కె.నాగబాబు, అల్లు అరవింద్‌, బి.గోపాల్‌, కె.ఎల్‌.నారాయణ, అశ్వినీదత్‌, కోదండ రామిరెడ్డి, కె.ఎస్‌.రామారావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్యాంగ్‌స్టర్‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *