సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఆకివీడులో అత్యంత ఘనంగా నిర్వహించే న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మ వారి జాతర ప్రారంభ మహోత్సవంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామకృష్ణ రాజు గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర విజయవంతంగా నిర్వహించబడాలని, అమ్మ వారి దివ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ప్రార్థించారు. జాతర నేపథ్యంలో వందలాది మహిళలు శ్రీ అమ్మవారికి పసుపు నీళ్లతో నిండిన బిందెలతో అభిషేకం నిర్వహించి జాతర ప్రారంభించారు.
