సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, కొత్త పోస్టుల నియామకాలు , తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఈ నెల 25 నుంచి ‘ఫ్రీజింగ్’ అమల్లోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఉన్న స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. .ఈ ఫ్రీజింగ్ ఆంక్షలు కొత్త కేడర్లలో సిబ్బంది కేటాయింపులు పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 25 లోగ ప్రభుత్వ కీలక అధికారులు ‘ఇప్పటికే సెలెక్షన్ పోస్టులకు సంబంధించి డీపీసీ ప్రక్రియ పూర్తి చేయడం.. ఇప్పటికే ఆమోదం పొంది, ఆర్థిక శాఖ అనుమతి పొంది ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రమోషన్లకు ఆదేశాలివ్వడం.. నిబంధనల ప్రకారం అవసరమైన బదిలీలు, డిప్యుటేషన్ ఉత్తర్వులు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
