సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ తో తలా తోకలేని ప్యూహంతో ముద్దానికి దిగీ పరువు పోగొట్టుకొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన తిక్క చేష్టలతో ప్రపంచ దేశాలకు ఇప్పటికే ఆర్ధికంగా 30 బిలియన్ డాలర్స్ నష్టం కలిగించారని ఒక నివేదిక పేర్కొంటుంది. మరి ఆ నష్ట పరిహారాన్ని అమెరికా నుండి కోరే దొమ్ము ఇరాన్ కు తప్ప మరో దేశానికీ లేకపోవడం గమనార్హం. ఇంకోసారి అమెరికా దాడి చేస్తే సముద్రం క్రింది ఫైబర్ కేబుల్స్ ను పేల్చివేసి ఇంటర్ నెట్ ను ఆపివేసి అమెరికా కంపెనీ లను, వ్యాపారాలను సర్వ నాశనం చేసిపారేస్తానని ఇరాన్ ఇటీవల హెచ్చరించడంతో అమెరికా కు షాక్ తగిలింది. ఇదిలా ఉండగా చైనా పర్యటన తరువాత ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తానని ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజగా ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు. గల్ఫ్ దేశాల అధినేతల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు తాను వెనకడుగు వేసినట్లు తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ప్లాన్ ప్రకారం నేడు మంగళవారం రోజున ఈ దాడులు జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మిత్రదేశాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో అత్యంత కీలకమైన చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో దాడులను వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల అగ్రనేతలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.
