సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తే భారతీయ రూపాయి లేదా రూబుల్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ అమెరికా నిబంధనలు పాటిస్తున్న భారత్ రష్యా వద్ద చమురు నిలిపిసి ఇతర దేశాల వద్ద అమెరికా డాలర్స్ చెల్లించి హెచ్చు ధరలలో చమురు కొనుగోళ్లు చెయ్యడం వల్ల భారత్ వద్ద డాలర్స్ తరిగిపోయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రధాని మోడీ విజ్ఞప్తి తో ప్రజలు పెట్రోలు వాడకం తగ్గించినప్పటికీ దేశంలో వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజగా మంగళవారం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం నాలుగు రోజుల్లో ఇది రెండో సారి. మే 15వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయలు.. లీటర్ డీజిల్‌పై కూడా 3 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 94.77 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 97.77 రూపాయలు.. 87.67 రూపాయలు ఉన్న డీజిల్ ధర 90.67 రూపాయలు అయింది. మన ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అధిక టాక్స్ లు కారణంగా లీటర్ పెట్రోల్ సుమారు 114 రూపాయలకు పైగా పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు పెరిగి 104.49 రూపాయలు అయింది. డీజిల్‌పై 86 పైసలు పెరిగి 96.11 రూపాయలు అయింది.ఈ పెట్రోల్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *