సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలలో స్వయం భువుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఈ ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 3వ తేదీతో ఈ బ్రహోత్సవాలు ముగుస్తాయి. ఈనేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, ఈనెల 26వ తేదీన స్వామి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కూతుర్లుగా అలంకరిస్తారు. 27న అంకురార్పణ, ధ్వజారోహణ చేస్తారు. 29వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. మే 1వ తేదీన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. మే 3వ తేదీన వసంతోత్సవం చూర్ణోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిస్తారు.
