సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ బలగాలు అదుపులో పెట్టుకొంటే, ఇక అమెరికా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో 15 భారీ యుద్ధ నౌకలు మోహరించి ఇరాన్ నుండి ఏ దేశానికీ ముడిచమురు ఎగుమతులు కాకుండా దిగ్బంధించింది. అంతేకాకుండా ఇరాన్ పోర్టులకు ఏ నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఇలాంటి ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం లేకుండా సహకరిస్తామని తెలిపింది. ఈ రూట్‌ భారత్‌కు ఎప్పుడూ తెరిచే ఉంటుందని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ వెల్లడించారు. ఇరాన్‌కు భారత అత్యంత సన్నిహిత దేశమని.. నౌకల రాకపోకల విషయంలో ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మొన్న ముంబై పోర్ట్ కు ఇరాన్ కు చెందిన 2 ముడి చమురు నౌకలు చేరుకోవడంతో కీలక సమయంలో భారత్ ఆ చమురును కొనుగోలు చేసినట్లు వార్త సమాచారం. ఈసారి అమెరికా ఇరాన్ ఫై పౌర వాసాలు ఫై కానీ అణు కేంద్రాలపై దాడి చేస్తే ఇక సహించమని ,తాము రంగంలోకి వస్తామని రష్యా అడ్జక్షుడు పుతిన్ తాజగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *