సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జగన్ సర్కార్ గత 4 ఏళ్లుగా వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ , మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు రవాణా శాఖకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున అందిస్తోంది. ఈనెల 31న ఐదో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటో, ట్యాక్సీ , మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు రవాణా శాఖకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున అందిస్తోంది. ఇది వారికి వాహనానికి బీమా, చిన్న పాటి రిపేర్లులకు ఈ మొత్తం ఉపయోగపడుతోంది. ఇప్పటికే నాలుగు విడతలు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు విడతల్లో రూ.28 కోట్ల 90 లక్షల 30 వేలు అందజేశారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.40 వేల లబ్ధి పొందాడు. ఈ ఏడాది ఐదో విడత సాయానికి సంబంధించి ఇప్పటికే రవాణా శాఖ అధికారులు 9,282 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అర్హల జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. వారి ఖాతాల్లో రూ.9 కోట్ల 28 లక్షల 20 వేలను జమా చేయనున్నారు. గతేడాది లబ్ధిదారులు 7,882 మంది మాత్రమే ఉండగా ఈ ఏడాది 1,400 మందికి అదనంగా చేరడం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *