సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ ఉద్యోగులు సీఎం జగన్ కు కృతజ్ఞలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,140 సచివాలయాలలో 9,410 మంది ఉద్యొగులు పనిచేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ సచివాలయ వ్యవస్థ ద్వారా యువతకు 1 లక్ష 34 వేల మందికి పర్మినెంట్ఉద్యోగాలు కల్పించడంతో పాటు.. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యో గులను పర్మినెంట్ (ప్రొబేషన్ డిక్లేర్) చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి పే స్కేల్ ప్రకారం జీతాలు అందించడంతో తమ జీవితాలు నిలబెట్టారన్నారు.. ఇప్పడు సచివాలయ ఉద్యొగులు శాశ్వత ఉద్యో గులుగా మారి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తొలి ఇంక్రిమెంట్, డీఏ పెంపుతో జీతాలు పెంచిందని వారు హర్షాతిరేకాలు వ్య క్తం చేస్తున్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *