సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనేక రాజకీయ ట్విస్ట్‌ల తరువాత 4 సారులు గవర్నర్ కలిసాక తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ జోసెఫ్ విజయ్ నేడు, ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తో కలసి చేతులు పైకిఎత్తి సభికులకు వందనం చేసారు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ నటి త్రిష సందడి చేశారు. విజయ్ మొదటగా ఎన్నికల హామీ మేరకు 200 యూనిట్స్ వరకు ప్రజలకు ఉచిత విద్యుత్తూ ఫైల్ ఫై సంతకం చేసారు.తాను అనవసరపు హామీలు ఇవ్వన్నని ప్రజలకు చెయ్యిగలిగినంత మేలు చేస్తానని ప్రకటించారు. అనంతరం విజయ్ నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్లోకి విజయ్ను తీసుకెళ్లారు. సీఎం సీటులో కూర్చోవాల్సిందిగా అధికారులు కోరారు. అనంతరం చిరునవ్వుతో ముఖ్యమంత్రి సీటులో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోడీ తన ట్విటర్ లో సీఎం విజయ్ జోసఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
