సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బై పాస్ ఆరోడ్డులో భాష్యం స్కూల్ వద్ద నేటి ఆదివారం జరిగిన ఒక ప్రవేటు కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయపార్టీల అగ్ర నేతల ఆత్మీయ కోలాహలం కనపడింది. ఈ కార్యక్రమం కు అతిధులు హాజరు అయిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు మరియు బీజేపీ రాజ్య సభ సభ్యులు, పాక సత్యనారాయణ వైసీపీ MLC, కవురు శ్రీనివాస్, వైసీపీ MPP పెరిచెర్ల నరసింహ రాజు, టీడీపీ రాష్ట్ర నేత కోళ్ల నాగేశ్వర రావు, అల్లూరి సుబ్రమణ్య రాజు తదితరులు కొద్దీ సేపు ఆత్మీయ పిచ్చాపాటి నిర్వహించారు. వీరే కాదు ఎందరో అన్ని రాజకీయ పార్టీల నేతలు సందడి చేసారు. ఎన్నికలప్పుడే పార్టీలు మిగతా సమయంలో అందరు మిత్రులే.. అన్న నానుడి.. రాజకీయ పార్టీల క్రింది స్థాయి కార్యకర్తలు కూడా అలవరుచుకొంటే అందరు బాగుంటారు..
